Sridhar P
1 min readMay 2, 2020

--

ఎవరు నేను ?

అనంత ఆకాశపు కౌగిట్లో ఉన్న
పుడమి పురిటి
చిమ్మ చీకటి ని
చీల్చుకుని బయట కొచ్చిన

నేను
ఓ ఆలోచనా కణాన్ని.....

ఈ మరో ప్రపంచపు కాంతుల దారుల్లో నున్న
మలయమారుత మాయలో
మరకత మమకారంలో పడి...
ఈ స్పర్శ నేననుకుని,
నాలో ఉన్న నేను వేరనుకుని,
ఎలాగోలా బ్రతికేయాలనుకుని
ఇలా బ్రతికేస్తున్న

నేను
ఓ ఆలోచనా కణాన్ని....

కోరికల వలయంలో
కొట్టుకుపోతూ....
సుఖ దుఖ్హాలకు
బందీనవుతూ....

జీవితం పోరాటమనుకుంటూ
ఆజ్ఞాననుపుటంచులకు
జారిపోతూ....

అనుక్షణం నిరీక్షించే ఆ క్షణం ( highest point of happiness) ఎప్పుడొస్తుందా
అని ప్రతిక్షణం పరితపించే

నేను
ఓ ఆలోచనా కణాన్ని...

ఎదురుచూసే క్షణం ఆ " మరోక్షణంలో "(future) లేదనీ
"ఈ క్షణం" (this very moment) లో ఉందని తెలిసి కూడా ముసుగేసుకుని బతికేస్తున్న అఙ్ఞాతవాసినైన

నేను
ఓ ఆలోచనా కణాన్ని...

--

--