Pointless Discussions (Telugu)

Sridhar P
3 min readApr 7, 2020

చాప్టర్ -1

సాయంత్రం నాలుగయ్యింది, ఏదో అలా బోర్ కొట్టి బయటకొచ్చిన నేను , ఎదురుగా ఉన్న “టీ ” లో టీ చెప్పి అక్కడే కూర్చున్నాను, ఎదురుగా టేబుల్ మీదున్న యాష్ ట్రే చాలా విచిత్రంగా ఉంది, దానికున్న కంటిని పోలిన హోల్ నన్నే చూస్తున్నట్టు అనిపించి వెంటనే తల తిప్పుకున్నా, నాక్కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న బల్లమీద ఈగల సమూహం అక్కడ పడ్డ టీ చుక్కల మీద వాటి ఆహారం కోసం వాల్తుంటే అక్కడే ఉన్న షాపులో కుర్రాడు విసుక్కంటూ వాటిని తరుముతున్నాడు, తను చేసే పని మీద నిరాసక్తత కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆ కుర్రాడి లో… షాపులో పనిచేసే ఇంకో మధ్యవయస్కురాలి మీద పడింది నా దృష్టి , ఆవిడ అక్కడ టీ వగైరా అందిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా తన యజమాని చూడని సమయం చూస్కుని అక్కడున్న సమోసా ఆరగిస్తుంది, ఇంతలో నా అవతల పక్క కూర్చున్న కస్టమర్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ కి ఆ కుర్రాడు బిల్ తెచ్చాడు, బిల్ ఎమౌంట్ తో పాటూ వచ్చిన టిప్ ని తృప్తిగా చూస్కుని జేబులో వేసుకున్నాడు, తాగి వదిలిపెట్టిన గ్లాస్ తో పాటు బిల్లు తీసుకుని వెళ్తుండగా హఠాత్తుగా కాలు జారి తన చేతిలో ఉన్న గ్లాస్ తో సహా ఎదురుగా ఉన్న కాష్ కౌంటర్ టేబుల్ మీద బోర్లా పడ్డాడు ,భయంతో ఎం జరిగిందో తెలుసుకునే లోపే యజమాని అరవడం ,దెబ్బ కొట్టడం ఒకేసారి జరిగిపోయాయి, అప్పటికే ఎర్రగా కందిపోయిన తన చెంపని తడుముకుంటూ తేరుకుని చుట్టూ చూస్తూ కనిపించేట్టుగానే నొచ్చుకున్నాడు ఆ పదహారేళ్ళ కుర్రాడు.

“నిరాసక్తత, తృప్తి , కోపం, భయం అన్నీ పక్కపక్కనే… అన్నీ ఒకేలాంటి ఎమోషన్స్ , వేటికీ పెద్ద తేడా లేదు, టైమొచ్చింది…వాటంతటవే వొచ్చి పోయాయి”.

ఆ క్షణం , ఆ ఎమోషన్స్ అన్నీ ఒకేసారి నాపై దాడిచేసినట్టుగా అనిపించింది.
Time is nothing but a stubborn illusion
- ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్వొట్ గుర్తొచ్చి నవ్వుకున్నాను.

తుఫాను వెలిసిన ప్రశాంతత, లోకంలో ఉండే మూడు రకాల మనుషులూ అక్కడే ఉన్నట్టుగా అనిపించింది….
✓ బలహీనుల్ని భయపెట్టి బ్రతికే ఆ యజమాని
✓ క్షణక్షణం భయపడుతూ బ్రతికే ఆ కుర్రాడు
✓ ఎలాగోలా బ్రతికేయాలనుకునే ఆ మధ్య వయస్కురాలు
….

ఆలోచిస్తూ నాతో తెచ్చుకున్న జిడ్డు కృష్ణమూర్తి గారి “కామెంటరీస్ ఆన్ లివింగ్” పుస్తకం ఓపెన్ చేశాను page no.152 అనుకోకుండా ఓపెన్ అయింది.
Valuing An Experience” చాప్టర్ అది,
కాకతాళీయమా? అనుకుంటూనే చదవడం మొదలెట్టా……

“Now that you have had this experience, do you value it? Is it important to you, if one may ask, and do you hold on to it? “In a way, I suppose I do, if I am to answer honestly. It has given me a creative release — not that I write poems or paint, but this experience has brought about a deep sense of freedom and peace. I value it because it has caused a profound transformation in myself. It is, indeed, vitally important to me, and I would not lose it at any price.”

నిజమే.. మనిషికి ఊహ తెలిసొచ్చినప్పట్నుండి తనకి జరిగే ప్రతి మోమెంట్ కాన్్సయస్స్ (consciously) గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎప్పుడో మారిపోయేవాడు…ఆ ప్రతి ఎక్స్పీరియన్స్ కి మూలం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుంటే జీవిత సంకెళ్ళ నుండి మనిషెప్పుడో విముక్తుడై పోయేవాడు.

ఆలోచనలు రెండు రోజుల వెనకకు పరుగెత్తాయి.

ఆదివారం ఉదయం ఆరున్నర , ఋషికొండ సముద్ర తీరమ్ అది…
సూర్యోదయపు కిరణాల జిలుగు వెలుగుల్ని తమలో దాచుకోలేక బయటకి తోసేస్తూ ఆయాసంతోఎగిరెగిరి పడుతున్న అలలు వొడ్డుకొచ్చి తమ బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేక వెనక్కెళ్ళిపోతున్నాయి, ఎప్పుడూ జరిగేదే గా అనుకుంటూండగా దూరంగా ఒక కపుల్ వాక్ చేస్తూ దగ్గరగా వస్తుండటం గమనించా, ఆ కపుల్ వాకింగ్ పూర్తి చేసుకుని అక్కడే ఉన్న చప్టా మీద చతికిలబడ్డారు, కాసేపు కబుర్లు చెప్పుకుని తమతో తెచ్చుకున్న స్నాక్స్ బయటకు తీశారు, తినడం మొదలెట్టిన కొంతసేపటికి ఓ కుక్క అటుగా రావటం గమనించిన అతను తన దగ్గర్లో ఉన్న రాయిని చేతిలోకి తీసుకుని ఆవేశంగా ఆ కుక్క వైపు విసిరాడు, అక్కడకు దగ్గర్లో కూర్చోడానికి సిద్ధమవుతున్న అప్పటికే అలిసిపోయిన ఆ కుక్క తనకి తగిలిన దెబ్బకి బిగ్గరగా అరుచుకుంటూ దూరంగా పారిపోయింది… ఆమె కళ్ళల్లోకి గర్వంగా చూస్తూ గట్టిగా నవ్వాడు, ఆమె తిరిగి నవ్వింది, ఇద్దరూ శునకానందం పొందారు… అవును , ఆ శునకం పోగొట్టుకున్న ఆనందం వారు పొందారు.

“All forces occur in pairs such that if one object exerts a force on another object , then the second object exerts an equal and opposite reaction force on the first

పైన రెండు సిట్యుయేషన్స్ కీ ఈ “Newton’s 3rd Law of Motion” అప్లయి చేసి చూసాను,

అర్థం కాలేదు…
మనిషినని గుర్తొచ్చి కొంచెం కామన్సెన్స్ అప్లై చేసి చూసాను ,
అర్థమైంది…

చాలా వరకూ మనుషుల రియాక్షన్స్ యాక్షన్స్ నుండి కాకుండా ఎమోషన్స్ నుండి పుడతాయి

టీ రెడీ సార్, నవ్వుతూ టీ అందించాడు ఆ కుర్రాడు , ఇంతలోనే ఇంత మార్పా, బాగానే సెట్ అయిపోయాడన్న మాట అనుకుంటూ పొగలు కక్కుతున్న టీ సిప్ చేసా, అందులో ఉన్న అల్లం గొంతులో ఘాటుగా తగులుతుంటే ఎంతో హాయిగా అనిపించింది , ఈ ఘాటు శరీరానికి రుచి రూపంలో అయితే ఆస్వాదిస్తాం , ఆనందిస్తాం…కానీ అదే మనసుకి గాయం రూపంలో అయితే ఎందుకు బాధ పడిపోతాం ?

రెండూ వేరా ?

మళ్లీ పుస్తకం చదవటం లో తలమునకలై పోయా..….

To be continued……….

శ్రీధర్

--

--