ఉవ్వెత్తున ఎగిసిపడిన అల ఉన్నట్టుండి అణిగింది
ఒక్కసారిగా సద్దుమణిగింది, తన లోకాంతం అవ్వలేదు,
తీరం చేరింది,తీరు తెన్నులు మార్చింది సముద్రం లోపలికెళ్లింది,
మళ్ళీ ఎగసి పడింది
ఈసారి ఆవలి తీరం వైపు… తీరు పునరావృతమైoది తిరిగి సముద్రం చేరింది,
తన రూపం మార్చింది,
కడలి సుడుల మధ్య కొట్టాడింది
ఎగసి ఎగసి పడింది, తిరిగి తీరం చేరింది, తీరాన్వేషణలో జ్ఞానోదయమైనట్టుంది
గమ్యం తీరం కాదని అర్థమైనట్టుంది…
తిరిగి లోపలికెళ్లింది..