ఉవ్వెత్తున ఎగిసిపడిన అల ఉన్నట్టుండి అణిగింది
ఒక్కసారిగా సద్దుమణిగింది,

తన లోకాంతం అవ్వలేదు,
తీరం చేరింది,తీరు తెన్నులు మార్చింది

సముద్రం లోపలికెళ్లింది,
మళ్ళీ ఎగసి పడింది
ఈసారి ఆవలి తీరం వైపు…

తీరు పునరావృతమైoది

తిరిగి సముద్రం చేరింది,
తన రూపం మార్చింది,
కడలి సుడుల మధ్య కొట్టాడింది
ఎగసి ఎగసి పడింది,

తిరిగి తీరం చేరింది,

తీరాన్వేషణలో జ్ఞానోదయమైనట్టుంది
గమ్యం తీరం కాదని అర్థమైనట్టుంది…

తిరిగి లోపలికెళ్లింది..

ఈ సారి రావటానికి కాదు.
సముద్రం లో కలిసి పోవటానికి,
దానితో ఒక్కటైపోవడానికి...

“ పగలు రాత్రి లోకి ”

“ శబ్దం నిశ్శబ్ధం లోకి ”

“ ప్రకృతి మౌనం లోకి ” ( ప్రకృతి = creation)

“ మౌనం పురుషుని లోకి ” (పురుషుడు =cosmic consciousness)

పీతలేమో కలుగులోకి
పక్షులేమో గూటిలో కి
మనిషి మాత్రం మత్తులోకి
మత్తులాంటి జగత్తులో కి…

విశ్వం నీ ముందున్నా
రేపు ఎల్లుండంటూ
కల కంటూ
కద వింటూ
ఎన్నాళ్ళీ మారువేషం
ఎందుకీ తాపత్రయం…

లే లేచి పరిగెత్తు...
నీ లోనికి , నిజం లోకి
ఎక్కడనుంచొచ్చావో
అక్కడ నువ్వుంటావు…

పౌరుషాన్ని వదిలిపె ట్టు
కల్మషాన్ని కడిగిపెట్టు
నేనూ.. నువ్వూ.. అన్న
తేడానే విసిరికొట్టు…

ఏమో నువ్ దేవుడి వేమో 
కానే కాదంటే ఎలా ?

దూరంగా జరిగి పోహ్
ఈ బంధం నుంచి…
మాయనుంచి ....

వేగంగా తిరిగి పోహ్

కాంతి వైపు… నిజం వైపు....

అవునన్నా కాదన్నా
విశ్వమంత నిండున్న
మౌనమే… నీ దారి
ధ్యానమే… రహదారి

ఇది సత్యం, ఇది నిత్యం.
లేదింక ఏ సత్యం…

ఎక్కడైన ఇదే ఇదే…

పరమ “ తత్వo ”పరమ “ సత్యo”

ఎవరు నేను ?

అనంత ఆకాశపు కౌగిట్లో ఉన్న
పుడమి పురిటి
చిమ్మ చీకటి ని
చీల్చుకుని బయట కొచ్చిన

నేను
ఓ ఆలోచనా కణాన్ని.....

ఈ మరో ప్రపంచపు కాంతుల దారుల్లో నున్న
మలయమారుత మాయలో
మరకత మమకారంలో పడి...
ఈ స్పర్శ నేననుకుని,
నాలో ఉన్న నేను వేరనుకుని,
ఎలాగోలా బ్రతికేయాలనుకుని
ఇలా బ్రతికేస్తున్న

నేను
ఓ ఆలోచనా కణాన్ని....

కోరికల వలయంలో
కొట్టుకుపోతూ....
సుఖ దుఖ్హాలకు
బందీనవుతూ....

జీవితం పోరాటమనుకుంటూ
ఆజ్ఞాననుపుటంచులకు
జారిపోతూ....

అనుక్షణం నిరీక్షించే ఆ క్షణం ( highest point of happiness) ఎప్పుడొస్తుందా
అని ప్రతిక్షణం పరితపించే

నేను
ఓ ఆలోచనా కణాన్ని...

ఎదురుచూసే క్షణం ఆ " మరోక్షణంలో "(future) లేదనీ
"ఈ క్షణం" (this very moment) లో ఉందని తెలిసి కూడా ముసుగేసుకుని బతికేస్తున్న అఙ్ఞాతవాసినైన

నేను
ఓ ఆలోచనా కణాన్ని...

చాప్టర్ -1

సాయంత్రం నాలుగయ్యింది, ఏదో అలా బోర్ కొట్టి బయటకొచ్చిన నేను , ఎదురుగా ఉన్న “టీ ” లో టీ చెప్పి అక్కడే కూర్చున్నాను, ఎదురుగా టేబుల్ మీదున్న యాష్ ట్రే చాలా విచిత్రంగా ఉంది, దానికున్న కంటిని పోలిన హోల్ నన్నే చూస్తున్నట్టు అనిపించి వెంటనే తల తిప్పుకున్నా, నాక్కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న బల్లమీద ఈగల సమూహం అక్కడ పడ్డ టీ చుక్కల మీద…

Sridhar P

Seeker, Explorer, Writer

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store