“ పగలు రాత్రి లోకి ”
“ శబ్దం నిశ్శబ్ధం లోకి ”
“ ప్రకృతి మౌనం లోకి ” ( ప్రకృతి = creation)
“ మౌనం పురుషుని లోకి ” (పురుషుడు =cosmic consciousness)
పీతలేమో కలుగులోకి
పక్షులేమో గూటిలో కి
మనిషి మాత్రం మత్తులోకి
మత్తులాంటి జగత్తులో కి…
విశ్వం నీ ముందున్నా
రేపు ఎల్లుండంటూ
కల కంటూ
కద వింటూ
ఎన్నాళ్ళీ మారువేషం
ఎందుకీ తాపత్రయం…
లే లేచి పరిగెత్తు...
నీ లోనికి , నిజం లోకి
ఎక్కడనుంచొచ్చావో
అక్కడ నువ్వుంటావు…
పౌరుషాన్ని వదిలిపె ట్టు
కల్మషాన్ని కడిగిపెట్టు
నేనూ.. నువ్వూ.. అన్న
తేడానే విసిరికొట్టు…
ఏమో నువ్ దేవుడి వేమో
కానే కాదంటే ఎలా ?
దూరంగా జరిగి పోహ్
ఈ బంధం నుంచి…
మాయనుంచి ....
వేగంగా తిరిగి పోహ్
కాంతి వైపు… నిజం వైపు....
అవునన్నా కాదన్నా
విశ్వమంత నిండున్న
మౌనమే… నీ దారి
ధ్యానమే… రహదారి
ఇది సత్యం, ఇది నిత్యం.
లేదింక ఏ సత్యం…
ఎక్కడైన ఇదే ఇదే…
పరమ “ తత్వo ”…పరమ “ సత్యo”